Mee Bhoomi Details: మీ మొబైల్ ఫోన్ ద్వారా మీ భూమి వివరాలు తెలుసుకోండి

Mee Bhoomi Details: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ఏపీలో మీ భూమి వివరాలు మొబైల్ నుండి ఎలా తెలుసుకోవచ్చో తెలియజేస్తాము. ఆంధ్రప్రదేశ్ లో చాల మందికి తమ భూమి వివరాలు తెలుసుకోవడానికి శత విధాలుగా ప్రయత్నాలు చేస్తుంటారు. అంటే ఏదైనా ఇంటర్నెట్ సెంటర్ లేదా మీ సేవ చుట్టూ తిరుగుతూ ఉండాలి. కానీ ఎక్కడికి వెళ్లకుండా మీ స్మార్ట్ మొబైల్ నుండి “Mee Bhoomi” వివరాలు చాల స్మార్ట్ గా తెలుసుకోవడం ఎలానో చూడండి.

Mee bhoomi details

ఇప్పుడు మీరు ఏదైనా రుణ మాఫీ, పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన, ఎన్టీఆర్ రైతు భరోసా లాంటి ప్రభుత్వ పథకాలను దరఖాస్తు చేయడానికి లేదా ఏదైనా బ్యాంకులో మీరు వ్యవసాయ లోన్ తీసుకోవడానికి మీకు మీ పొలం లేదా భూమి యొక్క అడంగల్, గ్రామ 1బి లాంటి డాక్యూమెంట్లు అవసరం ఉంటుంది. అలంటి సమయంలో బ్యాంకు వాళ్ళు అడంగల్ మరియు 1బి పత్రాలు తీసుకు రమ్మంటారు. అలనాటి సమయంలో మీరు ఎక్కడికి పరుగెత్తకుండా మొబైల్ నుండి డౌన్లోడ్ చేసుకోవని సులభంగాప్రింట్ తీసుకోవచ్చు. లేదా ఎలాంటి సమయంలో అయిన మీ భూమి వివరాలు మీ దగ్గర ఉంటె చాలానే ఉపయోగాలుంటాయి.

మీ అడంగల్/గ్రామ అడంగల్ వివరాలు తెలుసుకోవడం ఎలా?

మిత్రులారా, మీరు సులభంగా మీ అడంగల్ మరియు గ్రామాఅడంగల్ వివరాలు తెలుసుకోవచ్చు. మీరు ఈ క్రింది ఇచ్చిన దశలను అనుసరించడం ద్వారా సులభంగా పొందవచ్చు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now
మీ భూమి
  1. మొదటిగా మీరు “మీ భూమి” అధికారిక వెబ్సైటును (https://meebhoomi.ap.gov.in/) సందర్సించాలి.
  2. తర్వాత అక్కడ “మీ అడంగల్ / గ్రామ అడంగల్” పైన క్లిక్ చేయండి.
  3. వివరాలు తెలుసుకోవడానికి మీరు జిల్లా పేరు, మండలం పేరు, గ్రామం పేరు ఎంపిక చేయండి. అలాగే అక్కడ “ROFR” లేదా “అడంగల్” ఎంపిక చేయండి.
  4. తర్వాత మీరు కావాల్సిన “One LP Number” లేదా “Entire Village” సెలెక్ట్ చేయండి.
  5. ఇవన్నీ కూడా కూడా మీకు కావాల్సిన వివరాలను బట్టి ఎంపిక చేసి, నెంబర్ నమోదు చేయడం ద్వారా మీరు వివరాలు పొందుతారు.
  6. చివరిగా మీరు ఈ వివరాలను ప్రింటౌట్ తీసుకోండి. లేదా PDF లో సేవ్ కూడా చేసుకోవచ్చు.

Advertisement

Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment