PMMY Loan: ప్రధాన మంత్రి ముద్ర యోజన ద్వారా లోన్ కోసం ఇలా దరఖాస్తు చేయండి

Advertisement

PMMY Loan: హలో మిత్రులారా!! కేంద్ర ప్రభుత్వం అందించే ముద్ర లోన్ తీసుకోవడం ఎలానో ఈ కథనం ద్వారా తెలియజేస్తాము. ఈ ముద్ర లోన్ అనేది ఎవరికైనా వ్యాపారం చెయ్యాలని ఇంటరెస్ట్ మరియు ఒక ప్రణాళికఉంటుందో వారికి సహాయం చేయడానికి పెట్టారు. ఈ ముద్ర లోన్ ద్వారా చాల మంది ఇప్పటికే లోన్ తీసుకుని తమ వ్యాపారాన్నిఅభివృద్ధి చేసుకున్నారు, మరికొంత మంది లోన్ కొత్త వ్యాపారాన్ని కూడా మొదలు పెట్టారు.

Mudra Loan (1) (1)

Pradhan Mantri MUDRA Yojana (PMMY) ద్వారా 2024-2025 ఆర్థిక సంవత్సరంలో 6.67 కోట్ల మందికి రూ. 1.8 లక్షల కోట్లు శాంక్షన్ అయినట్లు PMMY అధికారిక వెబ్సైటులో తెలిపారు.

Advertisement

Pradhan Mantri MUDRA Yojana (PMMY) ద్వారా 2023-2024 ఆర్థిక సంవత్సరంలో 6.23 కోట్ల మందికి రూ. 5 లక్షల కోట్లు శాంక్షన్ అయినట్లు PMMY అధికారిక వెబ్సైటులో తెలిపారు.

Also read: PM Kisan Yojana: రైతుల బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమ… 18వ విడత

ఇలా ఇప్పటికే చాల మందికి లోన్లుకు దరఖాస్తు చేసి లోన్ పొంది, వ్యాపారాన్ని బాగా అభివృద్ధి చేసుకునేవారు ఉన్నారు. మీ మెదడులో కూడా ఇదొక ఐడియా ఉంటె ప్రధాన మంత్రి ముద్ర యోజన మీకు స్వాగతం పలికినట్లే. మీరు ముద్ర లోన్ దరఖాస్తు చేసి, వ్యాపారాన్ని మొదలు పెట్టండి.

కావాల్సిన పత్రాలు

పీఎం ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేయడానికి మీకు ఈ క్రిందని తెలిపినపత్రాలు కావాలి.

  1. ID ప్రూఫ్
  2. చిరునామా పత్రము
  3. పాస్స్పోర్ సైజు ఫోటో
  4. సంతకం
  5. వ్యాపార ప్రణాళిక పత్రాలు
  6. వ్యాపార గుర్తింపు రుజువు పత్రము

ఇంకా మరికొన్ని పత్రాలు కూడా అవసరమయ్యే అవకాశం ఉంది.

పీఎం ముద్ర లోన్ ఎన్ని రకాలు

ప్రధాన మంత్రి ముద్ర లోన్ కోసం దరఖాస్తు చేయు అభ్యర్థికి అవసరమయ్యే డబ్బును మరియు వ్యాపార విస్తీర్ణాన్ని బట్టి శిశు, కిషోర్ మరియు తరుణ్ అని మూడు రకాలు ఉన్నాయి.

  1. “శిశు” ద్వారా మీరు 50 వేల వరకు లోన్ డబ్బులు ఇస్తుంది. కనుక ఇది మీరు చిరు వ్యాపారాల కోసం ధరఖాస్తు చేయవచ్చు.
  2. “కిషోర్” ద్వారా మీరు 50 వేల నుండి 5 లక్షల రూపాయల వరకు డబ్బును లోన్ గా ఇవ్వగలదు. అంటే మీరు మీడియం సైజు వ్యాపారం అయితే ముద్ర లోన్ లో దీనికి దరఖాస్తు చేసుకోవచ్చు.
  3. “తరుణ్” ద్వారా మీరు రూ 5 నుండి 20 లక్షల వరకు రుణాన్నిపొందవచ్చు. గతంలో ఇది 10 లక్షల వరకు మాత్రమే ఉండేది.

PMMY లోన్ కోసం ఎలా దరఖాస్తు చెయ్యాలి?

PMMY లోన్ కోసం దరఖాస్తు చేయడానికి మీరు మొదటిగా PMMY (https://www.mudra.org.in/) అధికారిక వెబ్సైటు సందర్శించాలి. తర్వాత అక్కడ మీరు “Apply for Mudra Loan” అనే ఆప్షన్ కనిపిస్తుంది. దాని పైన క్లిక్ చేసి మీ వివరాలను నమోదు చెయ్యాలి. అక్కడ మీరు కొన్ని ప్రశ్నలకు జవాబు ఇవ్వాలి. అంటే మీరు ఇంతకముందు వ్యాపారం చేసారా, ప్రస్తుతం ఏదైనా వ్యాపారం చేస్తున్నారా లేదా కొత్త వ్యాపారం మొదలు పెడుతున్నారా మరియు మీ వ్యాపారానికి ఎంత ఖర్చు అవుతుంది. ఇలాంటి వాటికి మీరు జవాబు ఇవ్వాలి. ఇదంతా కూడా మీ మొబైల్ నెంబర్ మరియు మెయిల్ ID తో OTP వెరిఫికేషన్ ద్వారా పూర్తి చెయ్యాలి.

విజయవంతమైన నమోదు తర్వాత మీరు అక్కడ ప్రాథమిక వివరాలు మరియు మీ వ్యాపార సంబంధిత వివరాలు పూరించాలి. ఇలా మీరు దరఖాస్తు ప్రక్రియ పూర్తి చెయ్యాలి. అంతే కాకుండా మీరు బ్యాంకు ద్వారా కూడా ఈ లోన్ కోసం ధరఖాస్తు చెయ్యాలి. దాని కోసం మీరు మీ దగ్గరలోని బ్యాంకు సందర్శించి మరిన్ని వివరాలు తెలుసుకోగలరు.

Advertisement

Leave a Comment