PM AJAY: మహిళలకు 50% సబ్సిడీతో వడ్డీ లేని రుణాలు ఇలా దరఖాస్తు చేసుకోండి

Advertisement

PM AJAY: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా పీఎం అజయ్ పథకం ద్వారా ఎలా లభ్హి పొందవచ్చో తెలియజేస్తాము. ప్రధాన్ మంత్రి అనుసుచిత్ జాతి అభ్యుదయ్ యోజన (PM-AJAY) 2021-22 సంవత్సరంలో వెనుకబడిన వర్గాల మహిళలకు సహాయం చేయడానికి ప్రారంభించారు. ఇందులో భాగంగా మహిళలు రూ. 50,000/- వరకు సబ్సిడీ పొందవచ్చు. మహిళలకు జీవనోపాధి కలిగించడానికి ప్రభుత్వం పీఎం అజయ్ పథకాన్ని అనుసంధానించి రూ. 3 లక్షల వరకు డ్వాక్రా లో ఉన్న SC/ST మహిళలకు ఋణం ఇవ్వాలనుకుంటుంది. ఆసక్తి ఉన్నవారు మీ డ్వాక్రా కి సంబందించిన CC లేదా మీ గ్రామంలో లీడర్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు.

PM AJAY

Table of Contents

50% సబ్సిడీ

మీరు మీ జీవనోపాధి కోసం ఈ ఋణం తీసుకొంటె మీకు 50% వరకు సబ్సిడీ ఉంటుంది. ఇక్కడ ఒక షరతు ఉంది. అది మీరు 50% అనగా రూ. 50,000/- వరకు మాత్రమే సబ్సిడీ పొందుతారు. అలాగే మిగతా చెల్లించాల్సిన ఋణం పైన మీకు వడ్డీ లేకుండా ఇస్తారు.

Advertisement

ఉదాహరణకు మీరు రూ. 1 లక్ష ఋణం తీసుకుంటే, మీకు 50 వేల రూపాయలు సబ్సిడీ పొందుతారు. అలాగే అందులో మీరు తిరిగి మిగతా 50 వేల రూపాయలు చెల్లిస్తే సరిపోతుంది.

PM-AJAY) పథకం ద్వారా గత మూడు సంవత్సరాలలో సాధించిన పురోగతి

Year 2021-22

  1. పీఎం అజయ్ పథకం ద్వారా 2021-22 సంవత్సరంలో 1017.07 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 215 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
  2. 758.64 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 444 గ్రాంట్-ఇన్-ఎయిడ్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు.
  3. 42.54 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 19 హాస్టళ్లను నిర్మించారు (13 బాలికలు & 6 అబ్బాయిలు)

సంవత్సరం [Year] 2022-23

  1. పీఎం అజయ్ పథకం ద్వారా 2022-23 సంవత్సరంలో 51.62 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 3609 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
  2. 99.8 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1072 గ్రాంట్-ఇన్-ఎయిడ్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు.
  3. 11.69 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 4 హాస్టళ్లను నిర్మించారు (3 బాలికలు & 1 అబ్బాయిలు)

Year 2023-24

  1. పీఎం అజయ్ పథకం ద్వారా 2023-24 సంవత్సరంలో 236.30 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 2,489 గ్రామాలను ఆదర్శ గ్రామాలుగా ప్రకటించారు.
  2. 165.17 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 1,893 గ్రాంట్-ఇన్-ఎయిడ్ ప్రాజెక్టులకు ఆమోదం ఇచ్చారు.
  3. 64.16 కోట్ల రూపాయలు ఖర్చు చేసి 21 హాస్టళ్లను నిర్మించారు (8 బాలికలు & 13 అబ్బాయిలు)

Also read: AP Sachivalyam: సచివాలయ ఉద్యోగులకు బంపర్ శుభవార్త… ఇకపై ఈ ఆంక్షలు లేవు

Advertisement

Leave a Comment