Advertisement
Rythu FREE Bhima: మిత్రులందరికీ నమస్కారం!!! ఈరోజు కథనం ద్వారా తెలంగాణలో రైతులకు రూ.5 లక్షల భీమా ఉచితంగా చేయడానికి ప్రభుత్వం ఆగష్టు 15 నుండి పునరుద్దరించనుంది. తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్రంలోని రైతులకు రుణ మాఫీ చేసి రైతులను ప్రశాంతంగా ఉండేలా చేసారు. అలాగే ఒక ఎకరానికి రూ. 15 వేల రూపాయలు ఇస్తాం అని కూడా తెలిపారు. అయితే 18 నుండి 59 సంవత్సరాలు ఉన్న రైతులకు రూ. 5 లక్షల భీమా చెయ్యాలని నిర్ణయించింది. దీని ఖర్చు అయ్యే ప్రతి రైతు సంవత్సరం ప్రీమియం 3,600 రూపాయలను ప్రభుత్వం భరిస్తుంది అని తెలిపారు.
వ్యవశాఖ ఇచ్చిన సమాచారాన్ని బట్టి ఇప్పటికి రాష్ట్రంలో 7.8 లక్షల పట్టాదారు పాస్ పుస్తకాలు ఉన్నాయి. అలాగే గత ఏడాది జూన్ నెలకు 3 లక్షల కొత్త పట్టాదారు పాస్ పుస్తకాలు పెరిగాయని తెలిపారు. అయితే ఇందులో కొంత మంది మాత్రమే అనగా 2.3 లక్షల మంది మాత్రమే భీమా కోసం దరఖాస్తు చేసుకున్నారు. జులై ఆఖరకు 60 సంవత్సరాలు పైబడిన వారిన భీమా నుండి తొలగించి, అర్హులైన వారికి భీమా చెయ్యాలని ప్రభుత్వం నిర్ణయించింది.
Advertisement
Also read: మహిళలకు 50% సబ్సిడీతో వడ్డీ లేని రుణాలు ఇలా దరఖాస్తు చేసుకోండి
Advertisement