Advertisement
Anganwadi with Play School: హలో మిత్రులారా!! తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు అయింది. అప్పటి నుండి తెలగాణ సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు చెప్పినట్టుగా హామీలను ఒక్కొక్కటిగా అన్ని అమలు చేసుకుంటూ వస్తున్నారు. తెలంగాణాలో విద్యార్థులకు మంచి విద్యను అందించి పాఠశాలలను బలోపేతం చేయడానికి సీఎం రేవంత్ రెడ్డి గట్టిగ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. చాల మంది తల్లిదండ్రులు పిల్లలను ప్లే స్కూల్ కు పంపలేని వారు ఇంటి దగ్గర ఉంచేస్తున్నారు, మరికొందరు ఎలాగోలా ఫీజులు కట్టి కార్పరేటు స్కూళ్లలో ప్లే స్కూల్ చదివిస్తున్నారు.
ఇలా ఇబ్బందులు పడుతూ ప్లే చదివించలేని వారి కోసం అంగన్వాడీలలోనే ప్లే స్కూల్ ప్రారంభించనున్నారు. అలాగే నియోజకవర్కాలలో సెమి రెసిడెన్సియల్ స్కూళ్లకు మొదలు పెట్టడానికి పెద్ద నిర్ణయం తీసుకున్నారు. అయితే ఈ సెమి రెసిడెన్షియల్ స్కూల్ లో అడ్మిషన్ పొందటానికి, అంగన్వాడీ లో ప్లే స్కూల్ పూర్తి చేసి ఉండాలని షరతులు కూడా ఉండే అవకాశం ఉందని చర్చలు జరుగుతున్నాయి.
Advertisement
Table of Contents
- అంగన్వాడీలలో ప్లే స్కూల్ ఎక్కడ ట్రయిల్ చేస్తున్నారు?
- అంగన్వాడిలో ప్లే స్కూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
ఇటీవల ఏ రాష్ట్రంలో లేని విధంగా రైతులకు చెప్పినట్లు రూ. 1.5 లక్షల వరకు రుణాలను మాఫీ రెండు దశాలనను పూర్తి చేసారు. అలాగే మూడవ దశగా రూ. 2 లక్షల రూపాయల వరకు ఉన్న రుణాలను ఆగష్టు నెలాఖరు లోపు మాఫీ చేస్తాం అని తెలిపారు.
Also read: రైతు రుణ మాఫీ 3వ దశ లబ్ధిదారుల లిస్ట్ చూడండి
సీఎం రేవంత్ రెడ్డి చాల మంచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. అయితే ఈ అంగన్వాడీ లో ప్లే స్కూల్ రాష్ట్రం అంత ఒకేసారి ప్రారంభించకుండా, కొన్ని మందలాల్లో ప్రారంభించి, రెస్పాన్స్ ఎలా ఉందొ చూసి రాష్ట్రం మొత్తం ప్రారంబించాలనుకున్నారు. అయితే అంగన్వాడీ లో ప్లే ప్లే స్కూల్ బోధన కోసం ఇంకా ఎక్కువ టీచర్లు అవసరం అవుతుంది. అలాగే వారికి ఎలా శిక్షణ ఇవ్వాలి అని విద్యావేత్తల దగ్గర నుండి సలహాలు తీసుకుంటున్నారు.
అంగన్వాడీలలో ప్లే స్కూల్ ఎక్కడ ట్రయిల్ చేస్తున్నారు?
అగన్వాడీలలో ప్లే స్కూల్ రాష్ట్రం అంతటా ఒకేసారి కాకుండా మహబూబ్ నగర్ జిల్లాలోని కొడంగల్, ఖమ్మం లోని మధిర నియోజకవర్గాలలో ఈ అంగన్వాడీ తో పాటు ప్లే స్కూల్ ను ట్రయిల్ వేయాలను కసరత్తులు జరుగుతున్నాయి. అయితే ఇది ఎంత వరకు విజయవంతం అవుతుందో చూడాలి.
అంగన్వాడిలో ప్లే స్కూల్ ఎప్పుడు ప్రారంభం అవుతుంది?
ఆగష్టు నెల 13వ తేదీ నుండి మంత్రి సీతక్క జిల్లాల వారీగా పర్యటన చేయనున్నారు. అలాగే సీఎం రేవంత్ రెడ్డి విదేశీ పర్యటన నుండి వచ్చాక అధికారికంగా అంగన్వాడిలో ప్లే స్కూల్ ప్రారంభించనున్నారని తెలిపారు.
ఈ అంగన్వాడీలలో ప్లే స్కూల్ విధానం పైన మీ అభిప్రాయాన్ని కామెంట్స్ లో తెలపండి.
Advertisement