PM Kisan Yojana: హలో మిత్రులారా!! ఈరోజు కథనం ద్వారా ప్రధాన మంత్రి యోజన ద్వారా రైతులకు అందించే ఆర్థిక సహాయం 18వ విడత గురించి తెలియజేస్తాము. దేశవ్యాప్తంగా రైతులకు సంవత్సరానికి రూ. 6000/- ఆర్థిక సహాయం చేస్తుంది. ఇది మొత్తం మూడు విడతలు అందిస్తారు. అంటే ఒక్కో విడతకు రూ. 2000 చొప్పున విడుదల చేస్తారు. ఈ పీఎం కిసాన్ యోజన పథకం 2019 వ సంవత్సరంలో ప్రారంభమైంది.

భారతదేశంలో ప్రధానంగా వ్యవసాయం చేసే వారికి ఈ పథకం ద్వారా లభిపొందే అవకాశం ఉంది. అయితే రైతులకు ఈ పథకం ద్వారా ఇప్పటికి 17 దశలుగా డబ్బులు జమ అయ్యాయి. ఇటీవల ఎన్నికలు పూర్తి అయిన తర్వాత 10వ విడతగా విడుదల చెయ్యాల్సిన 2000 రూపాయలను జూన్ 30వ తేదీన విడుదల చేసారు.
PM Kisan Yojana పథకానికి అర్హతలు
పీఎం కిసాన్ యోజన పథకానికి దరఖాస్తు చేయడానికి ఈ క్రిందిఅర్హతలు కలిగి ఉండాలి.
For more updates join in our whatsapp channel
- దరఖాస్తు దారునికి భూమి ఉండాలి.
- ఏదైనా బ్యాంకు లో ఖాతా, ఆధార కార్డుతో eKYC చేసి ఉండాలి.
- రేషన్ కార్డు కూడా ఉండాలి.
ఈ పథకానికి ధరఖాస్తుకి చేయడానికి కావాల్సిన పత్రాలు
కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రధాన మంత్రి కిసాన్ యోజన పథకానికి దరఖాస్తు చేయడానికి మీరు ఈ క్రింద పత్రాలు కలిగి ఉండాలి.
- ఆధార కార్డు
- రేషన్ కార్డు
- పొలము పాస్ పుస్తకం
- బ్యాంకు అకౌంట్ నెంబర్
- మొబైల్ నెంబర్
- కులధ్రువీకరణ పత్రము
- నివాస ధ్రువీకరణ పత్రము
మారే కాలాన్ని బట్టి మీరు ఇంకొన్ని పత్రాలు కలిగి ఉండాలి.
18వ విడత డబ్బులు ఎప్పుడు వస్తాయి?
ప్రధాన మంత్రి కిసాన్ యోజన 17వ విడత డబ్బులు జూన్ 30వ తేదీన విడుదల చేసారు. 18వ విడత కోసం ఎదురు చాల మంది రైతులు ఎదురు చూస్తున్న్నారు. అయితే ఈ 18వ విడత డబ్బులు అక్టోబర్ నెల లోపు విడుదల అయ్యే అవకాశం ఉంది.
Also read: Independence Day AP Schemes: ఏపీలో ఆగష్టు 15 నుండి అమలు చేసే పథకాలు ఇవే
పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్
పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రతి విడత డబ్బులు మీరు మొబైల్ ఫోన్ ద్వారా మీ బ్యాంకు ఖాతా లో జమ అయ్యాయో లేదో తెలుసుకోవచ్చు. మీరు ఈ క్రింది దశలను అనుసరించడం ద్వారా పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పేమెంట్ వివరాలు తెలుసుకోవచ్చు.

- మొదటిగా మీరు పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన అధికారిక వెబ్సైటు () సందర్సించాలి. లేదా (https://pmkisan.gov.in/BeneficiaryStatus_New.aspx) ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
- తర్వాత “Know Your Payment Status” అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి.
- అక్కడ “Registration” నెంబర్ నమోదు చేసి, captcha సాల్వ్ చేసి సబ్మిట్ చేయండి.
- తద్వారా మీరు పీఎం కిసాన్ యోజన పేమెంట్ స్టేటస్ తెలుసుకోవచ్చు.