Advertisement
Govt Investment Schemes: మిత్రులందరికీ నమస్కారం!! ఈరోజు కథనం ద్వారా ప్రభుత్వ పథకాలలో పెట్టుబడి పెట్టుబడి పెట్టడం ద్వారా పొందే ప్రయోజనాల గురించి తెలియయజేస్తాము.
మీరు మీ డబ్బును లాంగ్ టర్మ్ లో ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉండి, మీ డబ్బు సేఫ్ గా ఉండాలి మరియు పెట్టుబడి ద్వారా సంపాదించినా డబ్బుకు టాక్స్ బెనిఫిట్లు ఉండాలి అనుకుంటున్నారా? అయితే ఈ పథకాల వైపు ఒక లుక్ వేసుకోండి. ఈ పథకాల ద్వారా మీరు పెట్టుబడి పెడితే చాల మంచి ప్రయోజనాలు పొందుతారు. అలాగే మీరు పెట్టుబడి పెట్టేది ప్రభుత్వ పథకాలు కాబట్టి మీ డబ్బు సురక్షితం ఉంటుంది.
Advertisement
ఇంతకీ ఆ పథకం ఏమిటా? అని ఆలోచిస్తున్నారా? మీరు PPF పథకంలో పెట్టుబడి పెట్టడం ద్వారా మీరు 40 లక్షల రూపాయలు సంపాదించవచ్చు. అది ఎలానో వివరించి చెప్తాను చుడండి.
ప్రభుత్వ పథకం ద్వారా రూ. 40 లక్షలు ఎలా సంపాదించవచ్చు?
మీరు PPF (Public Provident Fund) లో పెట్టుబడి పెడితే 40 లక్షలు సంపాదించవచ్చు. ఎందుకంటే ఇప్పుడు వడ్డీ 7.1% ఉంది. ఈ పథకంలో మీరు 15 సంవత్సరాల పాటు పెట్టుబడి పెడుతూ ఉండాలి. ఈ పథకంలో మీరు సంవత్సరానికి కనీసం రూ.500 నుండి గరిష్టంగా రూ. 1.5లక్షల వరకు మాత్రమే పెట్టుబడి పెట్టవచ్చు.
ఉదాహరణకు మీరు సంవత్సరానికి రూ. 1.5 లక్షలు 15 సంవత్సరాలు పాటు పెట్టుబడి పెడితే మీరు 15 సంవత్సరాలకు మొత్తం రూ. 22,50,000/- పెట్టుబడి పెట్టినట్లు. మీరు పొందే ఇంటరెస్ట్ రూ. 18,18,209/- వస్తుంది. మీరు పెట్టుబడి మరియు మీకు వచ్చిన ఇంటరెస్ట్ కలిపి మీకు రూ. 40,68,209/- పొందుతారు.
ఇలా చూసుకుంటే మీ వీలుని బట్టి సంవత్సరంలో ఎన్ని సార్లు అయితే డిపాజిట్ చేసుకోవచ్చు. అలాగే సంవత్సరానికి 1.5 లక్షల రూపాయల వరకు మాత్రమే డిపాజిట్ చేసుకోగలరు. మీరు సంవత్సరానికి 500 రూపాయల పైన ఎంత అమౌంట్ అయితే డిపాజిట్ చేసుకోవచ్చు.
PPF ఖాతా ఎక్కడ Open చెయ్యాలి?
మీరు PPF ఖాతా బ్యాంకు లేదా పోస్ట్ ఆఫీసులో దరఖాస్తు చేయవచ్చు. మీరు దరఖాస్తు చేసిన ఒక్కరోజులో మీకు అకౌంట్ వివరాలు generate చేసి ఇస్తారు. ఒకసారి అకౌంట్ వివరాలు ఇచ్చిన తర్వాత మీరు ఆన్లైన్ ద్వారా డిపాజిట్ చేసుకోవచ్చు.
Advertisement