Child Adhaar Card: ఇలా సులభంగా పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోండి

Child Adhaar Card: మిత్రులందరికీ నమస్కార!! మన దేశ ప్రస్తుత కాలంలో మనిషికి ఆధార్ కార్డు లేనిదే ఎక్కడ పని జరగట్లేదు. మనం చిన్నపుడు చదువుకునే స్కూల్ నుండి ఏ ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆఫీస్కు వెళ్లినసరే ఆధార కార్డు అడుగుతున్నారు. ఎందుకంటే ఆధార్ కార్డు ద్వారా ఆ ఎవరు? ఏ ఊరి మనిషి? అనేది తెలుసుకోవడానికి ఇది ఒక ముఖ్యమైన పత్రము. అలంటి ఆధార కార్డు చిన్న పిల్లలకు ఎలా తీసుకోవాలో ఈరోజు కథనం ద్వారా తెలియజేస్తాము.

Child Adhaar card

ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలి?

సాధారణంగా ఆధార్ కార్డు తీసుకోవడానికి ఆధార్ సెంటర్ లేదా CSC సెంటర్లలో మనం రిజిస్టర్ చేపించుకోవచ్చు. ఆధార్ కార్డు తీసుకోవడానికి ముఖ్యముగా పుట్టిన తేదీ పత్రము, రేషన్ కార్డు మరియు మొబైల్ నెంబర్ అవసరం ఉంటుంది. ఈ వివరాలు సబ్మిట్ చేసి, అభ్యర్థి యొక్క బయోమెట్రిక్ మరియు మీ కన్ను స్కాన్ ఉపదయోగించి ఆధార కార్డుకు దరఖాస్తు చేస్తారు. అప్పుడు భారత ప్రభుత్వం మీ దరఖాస్తు తనిఖీ చేసి, మీకు ఇంతకముందు ఆధార్ కార్డు లేకపోతే మీకు కొత్త ఆధార్ కార్డు నెంబర్ generate చేసి మీ దరఖాస్తును అప్డేట్ చేస్తారు. అప్పుడు మీ మొబైల్ కు ఆధార్ కార్డు నెంబర్ generate అయినట్లు SMS వస్తుంది. అప్పుడు మీరు ఆధార్ అధికారిక వెబ్సైటు ద్వారా డౌన్లోడ్ చేసుకోగలరు.

మీ అందరికి ఒక సందేహం ఉంటుంది, పిల్లలకు ఆధార్ కార్డు ఎలా తీసుకోవాలి అని, ఏండుకులంటే వాళ్ళ బయోమెట్రిక్ చిన్న వయస్సులో సరిగ్గా పని చెయ్యదు, అలాగే వారి కన్ను స్కాన్ చేయడనికి కూడా సహకరించరు. చిన్న పిల్లలకు ఆధార్ కార్డు ఎలా దరఖాస్తు చెయ్యాలో క్రింద తెలియయజేశాము.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

నెలల పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవడం ఎలా?

మీ పిల్లలకు ఆధార కార్డు తీసుకోవడం చాల సులభం, అది ఎలానో చుడండి. చిన్న పిల్లలు బయోమెట్రిక్ తీసుకోవడం కుదరదు కాబట్టి, పిల్లల తల్లి లేదా తండ్రి బయోమెట్రిక్ లేదా వాళ్ళ ఆధార్ కార్డును బట్టి పిల్లలకు ఆధార్ కార్డు తీసుకోవచ్చు. అంటే మీ పిల్లలకు 10 సంవత్సరాలు వచ్చే వరకు తల్లి లేదా తండ్రి లేదా వారి సంరక్షకుల ఆధార్ కార్డులో బయోమెట్రిక్ ద్వారా ఇస్తారు.

చిన్న పిల్లల ఆధార్ కార్డు దరఖాస్తు చేయడనికి కావాల్సిన పత్రాలు

  1. పుట్టిన తేదీ సర్టిఫికెట్
  2. తల్లి లేదా తండ్రి లేదా సంరక్షకుల ఆధార్ కార్డు
  3. మొబైల్ నెంబర్

ఈ మూడు పత్రాలు ద్వారా మీరు ఆధార్ కార్డు చాల సులభంగా ఆధార్ సెంటర్ లేదా CSC సెంటర్ ద్వారా దరఖాస్తు చేయవచ్చు. అలాగే మీరు పిల్లల పేరు మాత్రం స్పెల్లింగ్ ఆధార కార్డు దరఖాస్తు చేసేటప్పుడే సరి చూసుకోండి, తర్వాత మార్చాలి అంటే చాల ప్రాసెస్ ఉంటుందని గమనించాలి.

How to Download Adhar Card?

మీరు మీ ఆధార్ కార్డును మీ మొబైల్ ఫోన్ ద్వారా చాల సులభంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది ఎలానో ఈ క్రింది దశలను చుడండి.

  1. మొదటిగా ఆధార్ కార్డు అధికారిక వెబ్సైటుకు వెళ్ళండి. [https://uidai.gov.in/]
  2. అక్కడ Get adhar క్లిక్ చేసి తర్వాత download adhaar పైన క్లిక్ చేయండి.
  3. తర్వాత మీ Aadhaar Number లేదా Enrolment ID Number లేదా Virtual ID Number నెంబర్ ఎంచుకొని మీరు ఆ నెంబర్ ఎంటర్ చెయ్యాలి.
  4. చివరిగా captcha ఎంటర్ చేసి సబ్మిట్ చేస్తే, మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్ కు OTP వస్తుంది.
  5. OTP వెరిఫై చేసాక, మీరు మీ ఆధార కార్డు సర్వీసులు వాడుకోవచ్చు, అలాగే డౌన్లోడ్ చేసుకోవచ్చు.
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment