Advertisement
3 Gas Cylinders Free in AP: మిత్రులందరికీ నమస్కరం!! ఎన్నికలకు ముంది NDA (టీడీపీ, జనసేన మరియు బీజేపీ) ప్రభుత్వం సంవత్సరానికి మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తాం అని హామీ ఇచ్చింది. ఇప్పటికి కూటమి ప్రభుత్వం ఈ మాటకు కట్టుబడి ఉంది అని నాదెండ్ల మనోహర్ గారు తెలిపారు.
ఈ ఉచిత 3 గ్యాస్ సీలిండర్ల పథకాన్ని ప్రారంభించడానికి రాష్ట్రం మొత్తం మీద ఎంత ఖర్చు అవుతున్నది అంచనా వేసి, మొదలు పెడతాము అని తెలియజేసారు. ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని ఆగష్టు 15వ తేదీ నుండి మొదలు పెడతామని చెప్పారు. అలాగే సంవత్సరానికి ఈ 3 ఉచిత గ్యాస్ సీలిండర్లు కూడా త్వరలో ప్రారంభిస్తాం అని తెలిపారు.
Advertisement
తాజా సమాచారం ప్రకారం, ఈ ఉచిత మూడు గ్యాస్ సీలిండర్లను పండుగ తేదీల్లో ఇవ్వడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అనగా వినాయక చవితి, దీపావళి మరియు ఉగాది పండుగలకు ఒక్కొక్కటిగా ఇస్తారు అన్నట్లు సమాచారం. ఇవి వరస తేదీలు చూసుకుంటే సెప్టెంబర్ 7న వినాయక చవితి, నవంబర్ 1న దీపావళి మరియు మార్చి 3వ తేదీన ఉగాది. ఈ మూడు తేదీలలో ఒక్కక్కటిగా ఇస్తారు.
ఏటా 3 గ్యాస్ సిలిండర్లు పథకాన్ని ఎలా అమలు చేస్తారు?
ఏటా మూడు గాస్ సీలిండర్ల పథకాన్ని అమలు చేయడానికి ఏపీ ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ పథకం కోసం ప్రభుత్వంలో ఇంకా కొన్ని చర్చలు జరుగుతున్నాయి. ఈ పథకానికి డబ్బును డైరెక్ట్ గా గ్యాస్ కంపెనీలకు ఇచ్చి, గ్యాస్ సీలిండర్లు లభిదారులకు ఇవ్వాల లేదా గ్యాస్ సీలిండర్లకు కావాల్సిన డబ్బు లభిదారుని ఖాతా లో చెల్లిచాలా? అనే విషయం పైన చర్చలు జరుగుతున్నాయి.
Advertisement