Annadata Sukhibhava Payment 2025: ఆంధ్రప్రదేశ్‌లోని రైతులకు ఈ నెల చివర్లో ఒక బంపర్ గిఫ్ట్ రాబోతోంది. రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం కలిసి నవంబర్ 19న రెండో విడత ఆర్థిక సాయం అందించనున్నాయి. దాదాపు 46 లక్షల 85 వేల మంది రైతు కుటుంబాల బ్యాంకు ఖాతాల్లో నేరుగా ₹7,000 జమ కానున్నాయి.
ఈ మొత్తం రెండు పథకాల నుంచి వస్తుంది. రాష్ట్రం నుంచి అన్నదాత సుఖీభవ కింద ₹5,000, కేంద్రం నుంచి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి కింద ₹2,000 వస్తాయి. రబీ సీజన్ ముందు ఈ సాయం రైతులకు చాలా ఉపయోగపడుతుంది.
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప జిల్లా కమలాపురంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. అదే సమయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశవ్యాప్తంగా పీఎం-కిసాన్ 21వ విడత నిధులను విడుదల చేస్తారు.
For more updates join in our whatsapp channel
ఈ ఏడాది ఆగస్టులోనే మొదటి విడతలో కూడా అదే మొత్తం వచ్చింది. అంటే రెండు విడతలతో రైతులకు ఇప్పటివరకు ₹14,000 వచ్చినట్టు. మిగిలిన ఒక విడత కూడా త్వరలోనే వస్తుంది.
| వివరాలు | మొత్తం (రూ.) |
|---|---|
| మొత్తం లబ్ధిదారులు | 46,85,838 కుటుంబాలు |
| రాష్ట్ర వాటా (అన్నదాత) | ₹2,342.92 కోట్లు |
| కేంద్ర వాటా (PM-కిసాన్) | ₹792.09 కోట్లు |
| మొత్తం ఖర్చు | ₹3,135 కోట్లు |
ఈ డబ్బు స్టేటస్ ఎలా తెలుసుకోవాలంటే చాలా సులువు. అధికారిక వెబ్‌సైట్ annadathasukhibhava.ap.gov.inలో “మీ స్థితిని తెలుసుకోండి” ఆప్షన్ ఉంటుంది. ఆధార్ నంబర్ వేసి కాప్చా పూర్తి చేస్తే వెంటనే మీ పేరు, గ్రామం, e-KYC స్టేటస్, ఇప్పటివరకు వచ్చిన డబ్బు వివరాలు కనిపిస్తాయి.
ఒకవేళ మీ స్టేటస్‌లో e-KYC పెండింగ్ అని కనిపిస్తే వెంటనే సమీప మీసేవా కేంద్రంలో పూర్తి చేయించుకోండి. లేకపోతే డబ్బు ఆగిపోతుంది.
గమనిక: ఈ సమాచారం ప్రభుత్వ అధికారిక ప్రకటనల ఆధారంగా అందించబడింది. ఆర్థిక నిర్ణయాలు తీసుకునే ముందు అధికారిక వెబ్‌సైట్‌లో స్వయంగా తనిఖీ చేసుకోవడం మంచిది.