Advertisement

ఆంధ్రప్రదేశ్‌ రైతుల ఖాతాల్లో రూ.1,713 కోట్లు నేరుగా జమ | AP paddy procurement record

AP paddy procurement record: ఆంధ్రప్రదేశ్‌లో రైతులకు ఎప్పటికప్పుడు మద్దతు అందించేందుకు ప్రభుత్వం పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉందని పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ స్పష్టం చేశారు. ధాన్యం కొనుగోలు ప్రక్రియను అతి వేగంగా నడిపిస్తున్నామని, రైతులు దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని హితవు పలికారు.

విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మంత్రి మాట్లాడుతూ… ఇప్పటివరకు 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రైతుల ఖాతాల్లో రూ.1,713 కోట్లు నేరుగా జమ చేశామని వెల్లడించారు. ధాన్యం కొనుగోలు జరిగిన 4 నుంచి 6 గంటల్లోనే డబ్బు జమ అవుతోందని, ఒక్క రూపాయి కూడా రైతు నష్టపోకుండా కల్లాల వద్దే కొనుగోలు చేస్తున్నామని గర్వంగా చెప్పారు.

Advertisement

కొందరు రాజకీయ నాయకులు ధాన్యం కొనుగోళ్లపై అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గత వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్ల బకాయిలు పెట్టిందని, కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నీ క్లియర్ చేసిందని గుర్తుచేశారు.

For more updates join in our whatsapp channel

WhatsApp Group Join Now

ఈ సీజన్‌లో కృష్ణా జిల్లాలోనే 1.07 లక్షల టన్నుల ధాన్యం సేకరణ జరిగిందని… ఇది ఒక రికార్డు అని మంత్రి పేర్కొన్నారు. గోదావరి ప్రాంతంలో కూడా లక్ష టన్నులు దాటింది. గత ప్రభుత్వం 2022-23లో 3.33 లక్షల టన్నులు కొనగా… తాము ఇప్పటికే రెట్టింపు దాటేశామని పోల్చి చూపారు.

AP Farmers Procurement Payment Status
AP Farmers Payment Status: ఏపీ రైతులకు శుభవార్త… ఖాతాల్లో డబ్బులు జమ మరియు మద్దతు ధర వివరాలు
వివరాలుగత ప్రభుత్వం (2022-23)ప్రస్తుత ప్రభుత్వం (2024-25)
ధాన్యం సేకరణ (మె.టన్నులు)3,33,1558,22,000+
చెల్లింపులు (కోట్ల రూ.)679.791,713+
రవాణా లారీలు నమోదు4552,715

రవాణా వ్యవస్థలో కూడా భారీ మార్పులు తెచ్చామని మంత్రి తెలిపారు. గతంలో 455 లారీలు ఉంటే… ఇప్పుడు 2,715 లారీలు నమోదయ్యాయి. కృష్ణా, గోదావరి జిల్లాల్లో రవాణా బకాయిలు రూ.9 కోట్లు చెల్లించామని చెప్పారు.

వర్షాల బెదిరింపు దృష్ట్యా మూడు నెలల ముందే కొనుగోలు ప్రారంభించినట్లు మంత్రి వివరించారు. డిసెంబర్ 1 నుంచి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని, కౌలు రైతులకు టార్పాలిన్ పట్టాలు సిద్ధం చేశామని తెలిపారు. రైతు సేవా కేంద్రాల్లో 7.53 కోట్ల గోనె సంచులు అందుబాటులో ఉన్నాయని… ముఖ్యమంత్రి సూచనతో మరో లక్ష సంచులు అదనంగా తయారు చేస్తున్నట్లు ప్రకటించారు.

చివరిగా మంత్రి రైతులకు మరోసారి గట్టి హామీ ఇచ్చారు… ఈ-క్రాప్‌లో నమోదైన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని, 75 కిలోల బస్తాకు రూ.1,792 మద్దతు ధర ఇస్తున్నామని… దళారుల మాయమాటలకు ఎవరూ లొంగొద్దని కోరారు.

FAQ’s

ఆంధ్రప్రదేశ్‌లో ఎంత ధాన్యం కొనుగోలు చేశారు?

ఇప్పటివరకు 8.22 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించి, రూ.1,713 కోట్లు రైతుల ఖాతాల్లో జమ చేశారు.

Digi Lakshmi Scheme Andhra Pradesh
Digi Lakshmi Scheme: 250కి పైగా ప్రభుత్వ, ప్రైవేటు సేవలు… G.O. MS. No. 117
75 కిలోల బస్తాకు ఎంత మద్దతు ధర ఇస్తున్నారు?

ప్రభుత్వం ఒక్కో 75 కిలోల బస్తాకు రూ.1,792 మద్దతు ధర చెల్లిస్తోంది.

గత ప్రభుత్వం ఎంత బకాయి పెట్టింది?

వైసీపీ ప్రభుత్వం రైతులకు రూ.1,674 కోట్ల బకాయిలు పెట్టింది. కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే అన్నీ క్లియర్ చేసింది.

వర్షాల నుంచి పంటను ఎలా కాపాడుతున్నారు?

డిసెంబర్ 1 నుంచి ఐసోలేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తున్నారు. కౌలు రైతులకు టార్పాలిన్ పట్టాలు సిద్ధం చేశారు

Advertisement
Telegram Group Join Now
WhatsApp Group Join Now

Leave a Comment